Pages

Monday, 23 November 2015

వాల్మికి రామాయణం -బాలకాండ


వాల్మికి రామాయణం -బాలకాండ 

Valmiki Ramayanam – Opening Stanzas

तपः स्वाध्याय निरताम् तपस्वी वाग्विदाम् वरम् |
नारदम् परिपप्रच्छ वाल्मीकिः मुनि पुंगवम् | 1.1.1
With Divine Sage Narada, the Sage-Poet Valmiki is enquiring about a man who is a composite for all merited endowments in his form and calibre. [1-1-1]
कः नु अस्मिन् सांप्रतम् लोके गुणवान् कः च वीर्यवान् |
धर्मज्ञः च कृतज्ञः च सत्य वाक्यो धृढ व्रतः || १-१-२
Who really is that person in this present world, who is principled, and also a potential one, a conscientious one, a redeemer, and also a truth-teller and self-determined in his deed... [1-1-2]
चारित्रेण च को युक्तः सर्व भूतेषु को हितः |
विद्वान् कः कः समर्थः च कः च एक प्रिय दर्शनः || १-१-३
Who is he with good conduct... who in respect of all beings is benign... who is adept and also the ablest one... also uniquely pleasant to look to
आत्मवान् को जित क्रोधो द्युतिमान् कः अनसूयकः |
कस्य बिभ्यति देवाः च जात रोषस्य संयुगे || १-१-४
"Who is that courageous one, who controlled his ire, who is brilliant, non-jealous and even whom do the gods fear, when provoked to war... [1-1-4]
एतत् इच्छामि अहम् श्रोतुम् परम् कौतूहलम् हि मे |
महर्षे त्वम् समर्थोऽसि ज्ञातुम् एवम् विधम् नरम् || १-१-५

All this I wish to listen from you, oh! Great Sage, as you are a mastermind to know this kind of man, and indeed my inquisitiveness is immense..." Thus Valmiki enquired with Narada. [1-1-5]
इक्ष्वाकु वंश प्रभवो रामो नाम जनैः श्रुतः |
नियत आत्मा महावीर्यो द्युतिमान् धृतिमान् वशी || १-१-८
"One emerged from Ikshvaku dynasty and known to people as Rama by his name, and he is conscientious, highly valorous, resplendent, steadfast and a controller of vice and vile... and his own senses, as well... [1-1-8]
बुद्धिमान् नीतिमान् वाङ्ग्मी श्रीमान् शत्रु निबर्हणः |
विपुलांसो महाबाहुः कंबु ग्रीवो महाहनुः || १-१-९
"He is an adept one, moralist, learned, propitious, and a destroyer of enemies. His arms are lengthy, and his neck is like a conch-shell, and cheekbones high. [1-1-9]
తపః స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిః మునిపుంగవం || 1-1-1
కః అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః || 1-1-2
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః || 1-1-3
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||1-1-4
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే .
మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవంవిధం నరమ్ ৷৷1.1.5৷৷
ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైశ్శ్రుత: .
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్  ధృతిమాన్ వశీ ৷৷1.1.8৷৷
బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణ: .
విపులాంసో మహాబాహు: కమ్బుగ్రీవో మహాహను: ৷৷1.1.9৷৷

Saturday, 21 November 2015

ధ్రువుని నారాయణ స్తుతి


ధ్రువుని నారాయణ స్తుతి 

యో 2 న్త ప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తమ్ 
సంజీవయతి అఖిల శక్తి ధర స్వధామ్నా। 
అన్యంచ హస్త చరణ శ్రవణ త్వగాదిన్ 
ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం ॥ 
yo ’ntaḥ praviśya mama vācam imāṁ prasuptāṁ

sañjīvayaty akhila-śakti-dharaḥ sva-dhāmnā

anyāṁś ca hasta-caraṇa-śravaṇa-tvag-ādīn

prāṇān namo bhagavate puruṣāya tubhyam

(ధ్రువుడు) యీశ్వరుని వేదాత్మకంబులైన తన వాక్కుల నిట్లని స్తుతించె: దేవా! అఖిల శక్తిధరుండవు నంత ప్రవిష్టుడవైన నీవు లీనంబులైన మదీయ వాక్యంబులన్, ప్రాణేంద్రియంబులం గర చరణ శ్రవణ త్వగాదులను చిచ్ఛక్తిసే గృపంజేసి జీవింపంచేసిన  భగవంతుడవు, పరమపురుషుండ వైన నీకు నమస్కరింతు


Mahabharata Adiparva





नारायणं नमस्कृत्य नरं चैव नरॊत्तमम
     
देवीं सरस्वतीं चैव ततॊ जयम उदीरयेत
Om! Having bowed down to Narayana and Nara, the most exalted male being, and also to the goddess Saraswati, must the word Jaya be uttered.
1.56.31 – 1.56.33
 31 भारतानां महज जन्म महाभारतम उच्यते
    
निरुक्तम अस्य यॊ वेद सर्वपापैर परमुच्यते
 32
तरिभिर वर्षैः सदॊत्थायी कृष्णद्वैपायनॊ मुनिः
    
महाभारतम आख्यानं कृतवान इदम उत्तमम
 33
धर्मे चार्थे च कामे च मॊक्षे च भरतर्षभ
    
यद इहास्ति तद अन्यत्र यन नेहास्ति न तत कव चित
208 चत्वार एकतॊ वेदा भारतं चैकम एकतः
       
समागतैः सुरर्षिभिस तुलाम आरॊपितं पुरा
       
महत्त्वे च गुरुत्वे च धरियमाणं ततॊ ऽधिकम
209
महत्त्वाद भारवत्त्वाच च महाभारतम उच्यते
        
निरुक्तम अस्य यॊ वेद सर्वपापैः परमुच्यते
    "In former days, having placed the four Vedas on one side and the Bharata on the other, these were weighed in the balance by the celestials assembled for that purpose. And as the latter weighed heavier than the four Vedas with their mysteries, from that period it hath been called in the world Mahabharata (the great Bharata). Being esteemed superior both in substance and gravity of import it is denominated Mahabharata on account of such substance and gravity of import. He that knoweth its meaning is saved from all his sins.

  इतिहास पुराणाभ्यां वेदं समुपबृंहयेत
  
बिभेत्य अल्पश्रुताद वेदॊ माम अयं परतरिष्यति 1.204
By the aid of history and the Puranas, the Veda may be expounded; but the Veda is afraid of one of little information lest he should it. The learned man who recites to other this Veda of Vyasa reapeth advantage. It may without doubt destroy even the sin of killing the embryo and the like. He that readeth this holy chapter of the moon, readeth the whole of the Bharata, I ween. The man who with reverence daily listeneth to this sacred work acquireth long life and renown and ascendeth to heaven.



Wednesday, 18 November 2015

సాంఖ్య దర్శనం

సాంఖ్య దర్శనం

కపిల మహర్షి చెప్పిన సాంఖ్య దర్శనం అత్యంత ప్రాచీనమైనది. భాగవతము మూడవ స్కంధములో ఈయన చరిత్ర ఉంది. భగవంతుడే గీతలో “సిద్దానాం కపిలో ముని" అని విభూతియోగములో చెప్పాడు. కపిలుని తల్లిదండ్రులు దేవహూతి, కర్దమ ప్రజాపతి. కపిలుడు సాంఖ్యాన్ని మొదట తల్లికే చెప్పాడు. సాంఖ్య దర్శనం అత్యంత ప్రాచీనము, భారతీయ తత్త్వ శాస్త్రానికి పునాది. పురాణములు, స్మృతులు, ఆయుర్వేదము, తంత్రములు, యోగశాస్త్రము మొదలైనవి సాంఖ్యములోని భావములను ఉపయోగించుకున్నాయి.
సాంఖ్యమును సమ్యగ్దర్శనం అంటారు. ఈ జగత్తును సంపూర్ణముగా దర్శింపచేసేది అని అర్థము. సంఖ్యల జ్ఞానమే (enumeration and analysis) సాంఖ్యమని ఒక వ్యుత్పత్తి. జ్ఞానవంతుణ్ణి సాంఖ్యుడని వ్యవహరిస్తారు. మహాభారతము "సంఖ్య శబ్దమే ప్రకృతి" అని తెలుపుతూ ప్రకృతి చెప్పే చతుర్వింశతి (24) తత్త్వముల జ్ఞానము సాంఖ్యమనీ, వీటి ద్వారా మూలప్రకృతి స్వరూపమును దర్శించుట ఈ శాస్త్రము లక్ష్యమనీ చెబుతుంది. సంఖ్య పదానికి సదసద్వివేకమును పొందిన బుద్ధి అని కూడా అర్థము చెప్పవచ్చును. ఆ బుద్ధిని ఇచ్చే మార్గము సాంఖ్యము. మొత్తము శాస్త్రములో అరువది భాగములున్నాయి. అందువలన ఈ శాస్త్రాన్ని షష్టి తంత్రమని కూడా పిలుస్తారు. ఈ శబ్దము అహిర్బుధ్న్య సంహిత అనే వైష్ణవ ఆగమములోనూ, కాశ్మీర శైవములోను కనుపిస్తుంది. కపిలుని తరువాత ఆయన శిష్యుడు ఆసురి, ఆసురి శిష్యుడు పంచశిఖుడు మొదలైనవారు సాంఖ్యమును బోధించారు. వీరి ప్రసక్తి పురాణేతిహాసాల ద్వారా మాత్రమే తెలిసినది. సాంఖ్యము యొక్క ప్రాచీన గ్రంధములేవీ నేడు లభించవు. ఇప్పుడు లభించే ప్రాచీన గ్రంధము ఈశ్వరకృష్ణుని సాంఖ్య కారిక. ఈశ్వర కృష్ణుడు బహుశా గుప్తుల కాలము వాడు. సాంఖ్య కారికలోని అంశములు: సూత్ర ప్రతిపాదన, ప్రమాణ నిర్వచనము, అవయవ (శాస్త్రభాగముల) ప్రతిపాదన, అవయవ నిర్మాణము, సంశయ నివారణ, దిశా నిర్దేశము.
మొదటి సూత్రం
దుఃఖ త్రయాభిఘాతాత్ జిజ్ఞాసా తదాభిఘాతకే హేతౌ
దృష్టేసా'పార్థా చేత్ నైకాన్తాత్యన్తతో 'భావాత్
దుఃఖ త్రయము (తాపత్రయము - ఆధిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవికములు) వలన దుఃఖ హేతువులపై జిజ్ఞాస, వాని నివారణకు మార్గాన్వేషణ మొదలౌతాయి. అగోచరమైన ఆ మార్గాలకై ప్రయత్నమే సాంఖ్య శాస్త్ర ప్రయోజనం.
సాంఖ్యములోని పంచవింశతి (25) తత్త్వములు ఇవి. 1. మూల ప్రకృతి - దీనికే ప్రధానమని పేరు. 2. మహత్ - ఇదే బుద్ధి అనబడుతున్నది. 3. అహంకారము. 4-8 పంచ తన్మాత్రలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. 9-13 పంచ భూతములు - పృధ్వి, జలము, తేజస్సు,వాయువు, ఆకాశము. 14-18 పంచ జ్ఞానేంద్రియాలు - చక్షు, త్వక్, రసన, ఘ్రాణ, శ్రోత్రాలు. 19-23 పంచ కర్మేంద్రియాలు - పాయు, ఉపస్థ, పాణి, పాద, వాక్కులు. 24. మనస్సు. 25. పురుషులు (పురుషుడు). నిరీశ్వర సాంఖ్యములో పురుషులు (జీవులు) అనేకులు. సేశ్వర సాంఖ్యములో పురుషుడు పరమాత్మ.
ఈ తత్త్వములన్నిటిలో ఒక సంబంధము కనబడుతుంది. ద్రవ్యము యొక్క ఒక స్వరూపము నాశనమై వేరొక ద్రవ్యముగా పరిణామం చెందుతుంది. ఈ పరిణామాన్నేవికారము లేదా వికృతి అని వ్యవహరిస్తారు. పాలు పెరుగుగా మారడము, బీజము వృక్షముగా రూపుదిద్దుకోవడము దీనికి ఉదాహరణలు. మూలప్రకృతి ప్రకృతి ఐతే, మహత్తత్త్వము అనగా బుద్ధి దానికి వికృతి. బుద్ధినుండి అహంకారము పుట్టుచున్నది.బుద్ధి అనే ప్రకృతికి అహంకారము వికృతి. అహంకారము వలన పంచ తన్మాత్రలు, తన్మాత్రల వలన పంచభూతములు పుట్టినవి. పంచ భూతములు, జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, మనస్సు ఈ పదియారును కేవలము వికృతులు. వీటిని షోడశ వికారములని పిలుస్తారు. ఈ 24 జడమైన ప్రకృతికి సంబంధించినవి. పురుషుడు (జీవుడు) చైతన్య స్వరూపుడు. ప్రకృతి కాడు, వికృతీ కాడు. మనస్సు, దేహము, ఇంద్రియములన్నిటికీ భిన్నుడు. సాక్షివలె ఉంటూ ప్రపంచ వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. ప్రపంచ వ్యవహారాలను నడిపేది ప్రకృతి.
జీవుడు అజ్ఞానము వలన అనాత్మలైన దేహము,ఇంద్రియముల వలన లభించిన సుఖ,దుఃఖాలను తనమీద ఆరోపించుకొని ఆ సుఖదుఃఖాలను భోక్తగా అనుభవిస్తాడు. ఈ అజ్ఞానము పోగానే తాను నిర్లిప్తత తో లౌకిక వ్యవహారాలను గమనిస్తాడు. ఇదే ముక్త స్థితి లేదా కైవల్యము.
సాంఖ్య కారిక విశేషాలు మరికొన్ని: సాంఖ్యము ప్రత్యక్ష, అనుమాన, శబ్ద (ఆప్త వచన) ప్రమాణాలను గుర్తిస్తుంది. మూలప్రకృతి అనుమాన సిద్ధము. ప్రతి కార్యము దాని కారణములో అంతర్గతముగా ఉంటుంది. స్వర్ణము లేనిదే ఆభరణము రాదు. స్వర్ణము ఉపాదాన కారణము, స్వర్ణకారుడు నిమిత్త కారణము. సత్త్వ రజో తమస్సులు ద్రవ్యాత్మకమైన త్రిగుణములు. ఈశ్వరుని గుర్తిస్తే అతడు పురుషుడై నిమిత్త కారణముగానూ, ప్రకృతిని తానే సృష్టించి ఉపాదాన కారణముగానూ ఉన్నాడు. ప్రతి జీవునియందును తనచేకల్పితమైన మాయవలన తానే భోక్తయను అహంకారమును కలిగించి సాక్షిగా నిలిచిన ఈశ్వరుడున్నాడు. మహాప్రళయమందు అసంఖ్యాకులైన జీవులను తనయందు దాచుకొనిన మాయ, ప్రధానము, అవ్యక్తము, అజ్ఞానము, అవిద్య, తమస్సు, సుషుప్తి అని అనేక నామములతో పిలువబడే మూలప్రకృతి ఇదే. మహత్తత్త్వానికి మరియొక పేరు బుద్ధి. ఆలోచనతో కూడిన వివేచన దాని లక్షణము. బుద్ధికే మతి, ఖ్యాతి, జ్ఞానము, ప్రజ్ఞ అనే నామాలున్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారాలు పురుషార్థ సాధనకై వాటి పనులు అవిచేస్తాయి. సృష్టిలో దేవ,మానవ, జంతు, వృక్ష వర్గాలున్నాయి. దేవతలు సత్త్వ ప్రధానులు, మానవులు రజోప్రధానులు, జంతు, వృక్షములు తమోప్రధానులు. ఒకొక దర్శనము సృష్టిని ఒకొక విధముగా వర్ణిస్తుంది. వైశేషికులది ఆరంభవాదము. సృష్టి అణువులతో ప్రారంభించి ఒక బాహ్య శక్తిచేత నిర్మింపబడుతుంది.సాంఖ్యులది పరిణామవాదము. కార్యము (ఉపాదాన) కారణములో ఉంటుంది. ద్రవ్యముల పూర్వధర్మములు మారి వేరు ధర్మములు పుట్టడము పరిణామము. (ఉదా: పాలు పెరుగుగా మారుట.) అద్వైత వేదాంతులది వివర్తవాదము. పరబ్రహ్మమే జగత్తు అనే మిధ్యా ప్రతిబింబముగా కనుపించుట.