ఋషి మిథునం - లోపాముద్ర-అగస్త్యుడు
యుగాల పర్యంతం వ్యాపించిన చరిత్ర అగస్త్య మహర్షిది. ఆదిత్యహృదయం, సూర్యస్తోత్రం వంటి స్తోత్రరాజాలకు ఆయన ఋషి. దేవాంశ సంభూతుడు.ఆయన మిత్రుడు (సూర్యుడు), వరుణుడు - వీరికి అప్సరస ఊర్వశిపై గల మోహంతో, ఆ దేవతలు తమ మోహాన్ని (తేజస్సుని) ఒక కుండలో ఉంచివెడితే పుట్టినవాడు. అందుచేత ఆయనను కుంభసంభవుడంటారు. ఆయనను మైత్రావరుణుడు అంటారు. ఆయనలో అగ్నివాయువుల అంశలు కూడా ఉన్నాయి. పురూరవుడు ఊర్వశిని వివాహంచేసుకొని భూమి మీద ఉన్నప్పుడే ఇది జరిగింది.. ఊర్వశికి ఈకథ కూడా తెలియదు. అందుచేత అగస్త్యుడు భూమి మీద జన్మించినా దైవాంశ సంభూతుడు. దేవతలే ఆయనకు సంస్కారాలు చేశారు, పేరు పెట్టారు. అగ+ అస్తి నుండి అగస్త్యుడనే పదం వచ్చినది. అగ అంటే జలమునింపిన కుంభమని ఒక అర్థం ఉన్నది, సూర్యుడు అని ఒక అర్థం ఉన్నది. అగస్త్యుడు గొప్ప శివ భక్తుడు.
అతడొక సారి ఒక అరణ్యంలో తిరుగుతుంటే, ఒక వృక్షానికి కాళ్ళతో తలక్రిందుగా వ్రేలాడుతో తపస్సుచేస్తున్న ఋషులు కనబడతారు. అగస్త్యుడు వారిని ఎందుకు తపస్సుచేస్తున్నారని అడిగిటే వారు పితృదేవతలమనీ భూలోకంలో వారిని సరిగా ఆరాధింపడంలేదనీ చెబుతారు. అగస్త్యుని పిల్లలను కని, వారిని తండ్రులుగా భావించి, అరాధించమని అడుగుతారు. అగస్త్యుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు ఆయనకు వధువు కావాలి. ఎవరూ ఆయనకు తగిన వారిగా కనుపించలేదు. అప్పుడు ఆయన విదర్భ దేశం వెడతాడు. అక్కడ రాజుకు పిల్లలులేక తన బాధ ఈయనతో చెప్పుకుంటాడు. అగస్త్యుడు తనకు ఎలాంటి భార్య కావాలో ఊహించుకొని, రాజా! నీకు ఆడపిల్ల పుడుతుంది. యుక్త వయస్సు వచ్చాక తనకు ఇచ్చి పెళ్ళి చేయమని అడుగుతాడు. రాజు అంగీకరిస్తాడు. అలాగే జరుగుతుంది. అమ్మాయి కలుగుతుంది. లోపాముద్ర ఆమె పేరు. మహా సౌందర్యవతి. "ఇంత అందమైన రాజకుమారిని ఒక జడధారియైన ఋషికి ఈయడమా?" లేకపోతే ఆయనకు కోపం వచ్చి శపిస్తాడేమో అని భయం కలుగుతుంది.కాని ఆమె కారణ జన్మురాలు. ఈ కథ తల్లిదండ్రుల వలన విని, అగస్త్యుని వివాహ మాడుతుంది. అగస్త్యుడు లోపాముద్రను వివాహంచేసుకున్న స్థలం నేటి విదర్భలో, నాగపూర్ సమీపంలో, సిద్ధతీర్థంగా పిలువబడుతూంది. యువతీ యువకులకు అక్కడ స్నానంచేస్తే అత్య్త్తమమైన వరుడు కాని, వధువుకాని లభిస్తారని మహార్ష్ట్ర ప్రంతపు ప్రజల విశ్వాసం. వివాహం అవగానే అగస్త్యుడు ఆమె రాజోచిత దుస్తులను అలంకారాలాను వదలి, ఒక తాపసి భార్యకు ఉచితమైన నార చీరలు ధరింపమని చెబుతాడు. అప్పుడు ఆమెను గంగా ద్వార ప్రాంతానికి (నేటి హరిద్వార్) తీసుకొని వెళ్ళీ ఆశ్రమ జీవితం ప్రారంభిస్తాడు. ఆశ్రమ జీవితం చక్కగా గడిచిపోతున్నది. కొన్ని దినాలకు ఆయనకు పితృదేవతలకిచ్చిన వాగ్దానం గుర్తుకు వస్తుంది. భార్యకు చెబుతాడు. ఆమె భర్తతో ఇలా అంటుంది."ఆశ్రమవాస జీవితం బాగానే ఉంది. ఇప్పుడు పిల్లలు అంటే మనము ఇప్పుడు ఉన్న స్థితిలో శొభించదు. నాకు మంచి దుస్తులు కట్టుకుని, ఆభరణాలు ధరించి మీతో స్వేచ్ఛగా విహరించి కొన్నాళ్ళతరువాత పిల్లలు మనకు కలిగితే బాగుంటుంది. మీరు నాకు ఇంతవరకు ఏమిచ్చారు? గృహస్థ జీవితం గడపడానికి ధనం, స్వర్ణం కావాలి" కావాలంటే తమ రూపాలను మార్చుకొని, కనక వర్షం కురిపింపగల తపః శక్తి ఆయనకు ఉన్నది. కాని ఆయనకు తన తపస్సును కర్చుపెట్టాలనిపించలేదు. భార్యతో " సంపాదన కష్టమేమీ కాదు.ఏరాజు ఏరాజునడిగినా ఇస్తాడు. అని సమీపంలోని ఒక రాజ సభకు వెళ్తాడు.
శృతర్వుడు అనే రాజు వద్దకు అగస్త్యుడు వెళ్ళి, "రాజా నాకు కొంచెంధనము కావాలి" అని అడుగుతాడు. రాజుకు ఆశ్చర్యం, భయం కూడా వేశాయి. ఈ మహర్షి కనక వర్షం కురిపించగల తపశ్శాలి. నన్ను అడుగుతున్నాడు. ఆయనకు ఎంత కావాలో నేను ఈయగలనో లేదో అని సంకోచిస్తాడు. ఇద్దరు ముగ్గురు రాజులు ఆయనకు ఇవ్వడానికి వెనుకాడారు. అప్పుడు ఇల్వలుడు అనే రాక్షసాంశ లో పుట్టిన రాజు వద్దకు వెడతాడు. ఆరాజుకో తమ్ముడున్నాడు. వానిపేరు వాతాపి. వాళ్ళిద్దరికీ రాక్షసమాయలున్నాయి. కామరూపధారణ వంటి కొన్ని శక్తులున్నాయి. వారికి ఒక మునితో జరిగిన అనుభవం ఒకటి ఉంది. ఆమునిని వారు ఆశ్రయించి "మాకు కోరికలు తీరే మంత్రము ఉపదేశించండి" అని అడుగుతారు. ఆ ముని మీకు రాక్షసాంశ ఉన్నది.మీరు మంత్రాన్ని దురుపయోగంచేస్తారని భయం. మీకు ఈయను అంటాడు. ఇల్వలుడు వినయంగా "పోనీ వదిలేయండి. మాఇంట్లో పితృ కార్యం ఉన్నది.రేపు మాయింటికి భోక్తగా రండి" అని ఆహ్వానిస్తారు. వాతాపిని అన్నగారు మేకగా మార్చి, చంపి ఆమాంసాన్ని ఆ బ్రాహ్మణునికి పెడతాడు. తరువాత "వాతాపీ రా " అని మంత్రిస్తే వాడు బ్రతికి, ఆ ముని పొట్టచీలుచుకొని, బయటకు వస్తాడు.ఈ ప్రకారంగా వాళ్ళు వీలైనప్పుడల్లా బ్రాహ్మణ మాంస భక్షణ చేస్తున్నారు. అగస్త్యుడు ఇల్వలుని యొద్దకు ధనమడగటానికి వెడతాడు. అగస్త్యునికి అదే సత్కారం చేదామని ఇల్వలునికి అనిపిస్తుంది. ధనానికి ఏముంది. మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము. ముందు మా ఇంటిలో భోజనం చేయండి అని ఆహ్వానిస్తాడు. మామూలుగానే వాతాపిని మేకగా మార్చి వండి వడ్డిస్తాడు. భోజనమవగానే అగస్త్యుడు "వాతాపి జీర్ణం" అని మూడు సార్లు అంటాడు. వాతాపీ రా!రా! అని ఇల్వలుడు ఎన్నిసార్లు పిలిచినా లాభంలేక పోయింది. సముద్రజలమంతటినీ త్రాగిన అగస్త్యునికి వాతాపి ఒక లెక్కా? ఇల్వలుడు భయంతో వణికి పోయాడు తన దగ్గరున్న బంగారమంతా ఆయనకే ఇచ్చాడు. ఈ లోకోపకార కృత్యం ఆయన వలన జరగటానికే ఈ సంఘటన జరిగినది. నేటికీ మన దేశంలో తల్లులు పసిపిల్లలకు ఆహారమిచ్చినప్పుడు "జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం" అనడం వింటాము. అది అగస్త్య మునిని తలచుకోవడమే.
ఆయన బంగారం, ధనం తెచ్చి భార్యకు నగలు చేయించి, ఆమె కోరిన విధంగా ఉండి ఆనంద పేట్టాడు. కొన్ని రోజుల తర్వాత భార్యతో, "నీకు శక్తి, తేజస్సు కలిగిన నూరుగురు కొడుకులు కావాలా? దానికి పదిరెట్లు శక్తి, తేజస్సు కలిగిన, పది మంది పుత్రులు కావాలా? అందరి శక్తి తేజస్సు కలిగిన ఒక్క కొడుకు కావాలా? అని అడుగుతాడు. ఆమె ఆలోచించి ఒక్కడు చాలు అంటుంది. కొడుకు పుట్టాక వానికి తేజస్వి అని పేరు పెడతారు. ఎన్నో తరాలకు సరిపడ పుణ్యంచేసి పిత్రుదేవతలను వారి లోకానికి పంపించాడు. వాళ్ళకు ఉత్తమగతులు కలిపించడంకోసం అగస్త్యుని లీల ఇది. నిజానికి ఇది అగస్త్యుని ఋణం కాదు. తరువాత మళ్ళీ లోపాముద్ర, అగస్త్యుడు ఆశ్రమవాసానికి వెళ్ళిపోతారు.
ఒక సారి బ్రహ్మ దేవుడు వారి ఆశ్రమానికి వస్తాడు. "వేల సంవత్సరాలు తపస్సు చేస్తేకాని అవని బ్రహ్మ దర్శనం ఎందుకు కలిగినదని అగస్త్యునకే సందేహం వచ్చినది. "భూలోకంలో మనుష్యులు అనేక అధర్మాలు, పాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పాపాలే వాతాపి వలే నీఆహారం. నీలాంటి వాళ్ళ ఉనికి వల్లనే భూమి ధర్మ బద్ధంగా నడుస్తూంది. నీవే వాటిని జీర్ణం చేసుకోగలవు. మహర్షులే మానవ జాతికి ప్రాతః స్మరణీయులు. ఈ మాట నీతో చెప్పడానికే వచ్చాను" అని బ్రహ్మ అంటాడు.
దక్షిణ దేశంలో కవేరుడనే ముని బహుకాలం ముక్తి కొరకు శివుని గురించి తపస్సుచేస్తాడు. శివుడు ప్రత్యక్షమై నీవు ఇంకా ముక్తికి అర్హుడవు కావు. బ్రహ్మను గురించి తపస్సుచేయి. ఆయన నీకు జ్ఞానాన్ని ఇచ్చి ముక్తి మార్గాన్ని సూచిస్తాడు అని శివుడు చెప్పగా కవేర ముని అలాగే చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై “ నీకు జన్మాతరంలోని తీరనికోరిక ఒకటి మిగిలి పోయింది. అది పూర్తి ఐతేగాని నీకు ముక్తి రాదు. నీవు గృహస్థాశ్రమం స్వీకరించి ఒక బాలికకు తండ్రి కావాలి. ఆ కన్యను తగిన వరునికి ఇచ్చి వివాహం చేస్తే నీవు బంధవిముక్తుడవౌతావు అనిచెబుతాడు.కవేరుడు గృహస్థుడౌతాడు. కుమార్తె జన్మిస్తుంది. ఆమె కారణజన్మురాలు. ఆమెయే విష్ణుమాయ. ఆమె తండ్రి ముక్తి కోసం తపస్సు ప్రారంభిస్తుంది.కవేరుని కుమార్తె గా ఆమె పేరు కావేరి.

బ్రహ్మ దేవుడు కవేరముని తపస్సు, తండ్రి విముక్తికై కావేరి తపస్సు, ఈ విశేషాలు అగస్త్యునకు వివరిస్తాడు. “కావేరి ఎవరో కాదు, నీభార్య లోపాముద్ర వలెనే విష్ణుమాయ. అమెకు తగ్గ వరునివి నీవే. నీవు దక్షిణానికి వెళ్ళినప్పుడు ఈ కార్యం జరుగుతుంది.” అనిచెబుతాడు. ఇది అగస్త్యుడు ఉత్తరభారతం లో ఉన్నప్పుడు జరిగినది. తరువాత కొంత కాలానికి దేవకార్యం నిమిత్తం అగస్త్యుడు దక్షిణానికి వస్తాడు. కావేరి తపస్సు ఫలిస్తుంది. కవేరుడు ఆమెను అగస్త్యునకు ఇస్తాడు. ఆమె అగస్త్యునితో ఇలా అంటుంది. నా తపస్సు ఫలించింది. విష్ణువు నన్ను నదీ రూపంతో దక్షిణ దేశంలో ఉండిపొమ్మన్నాడు. మిమ్మలని స్త్రీగా వివాహం చేసుకొని మీకు ఏమి చేయగలను? అంటుంది. అగస్త్యుడు ఆమెతో నా కమండలములో జలరూపం లోనే ఉండిపో. అవసరం వచ్చినప్పుడు నిన్ను నదీరూపంలో దక్షిణ భారతంలో వదలుతాను. అని చెబుతాడు. గంగను పరమేశ్వరుడు శిరసున దాల్చి గంగోత్రిలో వదలినట్లే, గౌతముడు గంగను గోదావరిగా దక్షిణదేశానికి తెచ్చినట్లే, అగస్త్యుడు భూమిపై కావేరి ఉత్పత్తికి కారణమౌతాడు. నేడు బెంగుళూరుకు నీరు ఇచ్చేది ఆకావేరీ మాతయే.
అగస్త్యముని గంగాద్వారం విడిచి, భార్యతో కలసి కాశీలో నివాసం ఏర్పరచుకున్నాడు. అప్పుడు దేవతలకు ఆయనను దక్షిణదేశం పంపవలసిన పని వచ్చినది. దేవతలు మునులు ఆయనను వెదకుతూ కాశీవెళ్ళారు.
శ్రీనాథుడు తన కాశీఖండములో అగస్త్యమునిని ఇలా కీర్తించాడు:-
పంచాక్షరీ మంత్ర పారాయణమునకు, నెవ్వాని మానసం బేడుగడయు
దర్పోద్ధతులగు వాతాపీల్వలుకును, వధశిలాస్థానమెవ్వానికుక్షి
ఆదినెవ్వాని దివ్యావతారమునకు బూర్ణంబు భాండంబు పురిటి ఇల్లు
మెరసి లోపాముద్ర మెరుగు బాలిండ్లపై, బవళించునెవాని భవ్యమూర్తి
కసరి ఎవ్వాని కంఠ హుంకారరవము,
కొండచిలువల కులములో కూల్చెనహుషు
నట్టి పరమ మహాతేజు నలఘుతేజు
వెదకిరానందవనములో విబుధమునులు
ఆనందవనమంటే కాశీ. దేవతలు, మునులు ఆయన ఆశ్రమాన్ని దర్శించి ఆయనను స్తుతించారు. ఆయన చేస్తూన్న శివ స్తోత్రం విన్నారు. బృహస్పతి ఆయనతో ఇల్లా అన్నాడు. ఓ మహర్షీ, నీవు ప్రణవ స్వరూపుడవు. ఓంకారమేనీవు. ఈ లోపాముద్రాదేవి వేదరాశి. నీవు మూర్తీభవించిన తపస్సువే. ఆతపస్సు వలన లభించే శాంతి ఆ లోపాముద్రాదేవి. నీవు సూర్యుడవు.సూర్య స్తోత్రాలను ప్రజలకు ఇచ్చినవాడివి. ఈమెయే ఆతేజస్సు. నీవు బ్రహ్మ తేజస్సువు ఐతే ఆమే నిన్నసురించే బ్రహ్మ జ్ఞాన స్వరూపిణి. మిమ్ములనిద్దరను ఒకేసారి దర్శించుకోవడంవలన మేమంతా ధన్యులమయ్యాము" "మీరందరూ నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు?" అని అగస్త్యుడు వారిని అడిగాడు. ఆనందవనమంటే కాశీ. దేవతలు, మునులు ఆయన ఆశ్రమాన్ని దర్శించి ఆయనను స్తుతించారు. ఆయన చేస్తూన్న శివ స్తోత్రం విన్నారు. బృహస్పతి ఆయనతో ఇల్లా అన్నాడు. ఓ మహర్షీ, నీవు ప్రణవ స్వరూపుడవు. ఓంకారమేనీవు. ఈ లోపాముద్రాదేవి వేదరాశి. నీవు మూర్తీభవించిన తపస్సువే. ఆతపస్సు వలన లభించే శాంతి ఆ లోపాముద్రాదేవి. నీవు సూర్యుడవు.సూర్య స్తోత్రాలను ప్రజలకు ఇచ్చినవాడివి. ఈమెయే ఆతేజస్సు. నీవు బ్రహ్మ తేజస్సువు ఐతే ఆమే నిన్ను అనుసరించే బ్రహ్మ జ్ఞాన స్వరూపిణి. మిమ్ములనిద్దరను ఒకేసారి దర్శించుకోవడంవలన మేమంతా ధన్యులమయ్యాము"
"మీరందరూ నన్ను వెవెతుక్కుంటూ ఎందుకు వచ్చారు?" అని అగస్త్యుడు వారిని అడిగాడు. ఒకప్పుడు వింధ్య పర్వతం పెరిగిపోవడం మొదలు పెట్టింది. మేరు పర్వతం చుట్టూ తిరిగే సూర్యుని, తన చుట్టూ తిరిగేలా చేసుకోవాలని దాని ఊహ. అపుడు వింధ్య పర్వతం ఉత్తర, దక్షిణ భారతాలకు మధ్య అడ్డగోడలా తయారవుతున్నదని, దానిని నిరోధించమని దేవతలు, మునులు అగస్త్యుని అడిగారు.

దేవతలు, మునులు వింధ్య పర్వతాలను ఇంక పెరగకుండా చేయమని అగస్త్యుని ప్రార్థిస్తారు. అగస్త్యుడు, లోపాముద్ర వింధ్య దాటి దక్షిణానికి ప్రయాణం కడతారు. వింధ్య పర్వతం ఆయనకు శిరసు వంచి నమస్కరిస్తుంది. "నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు పెరగవద్దు, ఇలాగే ఉండుము" అని వింధ్యను ఆదేశిస్తాడు. ఆయన దక్షిణదేశంలోనే ఉండిపోయాడు, వింధ్య పర్వతం పెరగడమూ ఆగిపోయింది. (పర్వతాలను, నదులను, వృక్షాలను దేవతాత్మలుగా పరిగణించడం మన సంస్కృతి లోభాగం. కాళిదాసు కుమార సంభవం ఈ శ్లోకంతో ప్రారంభమౌతుంది. "అస్త్యుత్తరస్య దిశి దేవతాత్మా హిమాలయోనామ నగాధిరాజా" నేటి భారతంలో వీటి విషయంలో ఎంత అధర్మం, అపచారం చేస్తున్నామో తెలిసినదే). కాశీ విశ్వనాథునికి దూరంగా నివసించడం అగస్త్యునికి బాధ కలిగించింది. దక్షిణదేశంలో ఆయన దక్షారామ భీమేశ్వరుని దర్శిస్తాడు. కాశీ విశ్వనాథుడు దర్శనమిచ్చి, "నీకోసం నేను ఇక్కడ కూడా ఉంటాను.ఈక్షేత్రం దక్షిణకాశీగా పేరుపొందుతుంది" అని అభయము ఇస్తాడు. తరువాత అగస్త్యుడు, లోపాముద్ర కోలాహలపురంలోని మహాలక్ష్మిని దర్శిస్తారు. (నేటి కొల్హాపూర్) . అగస్త్యుడు అక్కడ మహాలక్ష్మిని ఉద్దేశించి ఒక స్తోత్రం చదువుతాడు. అది వెబ్ లో వినవచ్చును. దాని మొదటి ఐదు శ్లోకాలు
ఓం శ్రీ విష్ణువక్షస్థలస్థితాయై నమః
అగస్త్య మహర్షి విరచిత శ్రీలక్ష్మీ స్తోత్రం
జయ పద్మపలాశాక్షి జయ త్వం శ్రీపతిప్రియే |
జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవ తారిణి || 1
మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి |
హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే || 2
పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే |
సర్వభూత హితార్థాయ వసువృష్ఠిం సదా కురు || 3
జగన్మాతర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే |
దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోಽస్తుతే || 4
నమః క్షీరార్ణవసుతే నమస్త్రైలోక్యధారిణి |
వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతం || 5
మహాలక్ష్మి అగస్త్యునికి దర్శనమిస్తుంది. అనేక విషయాలు చెబుతుంది. "నీవు ద్వాపర యుగంలో వేద వ్యాసునిగా అవతరిస్తావు. అప్పుడు మళ్ళీ కాశీవెళ్ళే అవకాశం వస్తుంది. వేదాలను విభజించి నీశిష్యులద్వారా వ్యాప్తిచేస్తావు. మానవాళికి ఎంతో సాహిత్యాన్ని సృష్టిస్తావు. ఈ యుగంలో నీవలన కావలసిన పని దక్షిణ దేశంలోనే ఉంది.దక్షిణాన కావేరీతీరంలోని స్వామి మలై కు వెళ్ళు. అక్కడ కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరుడు)ని గురువుగా స్వీకరించు. ఆయన ద్వారా నీ కర్తవ్యంతెలుస్తుంది." ఆమె లోపాముద్రకు కూడా వరాలు ఇస్తుంది."లోపాముద్రా సహిత అగస్త్యమహర్షిని తలచుకున్న వారికి సమస్త శుభాలు, కల్యాణము, జరుగ్తాయి. నా (శ్రీ మహాలక్ష్మి) అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది"

అగస్త్యుడు
భార్య లోపాముద్రతో కలసి అనేక క్షేత్రాలు,తీర్థాలు దర్శించాడు. అనేక పుణ్యనదులలో స్నానాదికాలు
చేసేవాడు. లోపాముద్ర ఆయనను అడిగింది."ఏమండీ,
ఇన్ని క్షేత్రాలు సందర్శిస్తున్నాము. దీనివలన మనకు
ముక్తి వస్తుందా?" దీనికి ఆయన "నా తపస్సువల్లే ముక్తి
వస్తుంది. అదిఎప్పుడో పూర్తి అయింది. ఇది లోకులకు మార్గదర్శకం
గా ఉండడానికే" అని చెప్పలేదు. "మనము
మానవ దేహాలలో ఈభూమిమీద సంచరిస్తున్నాము. ఏ క్షణాన అయినా
మనవలన పొరపాటు జరగవచ్చు.ముక్తి గురించి భయం మానవులకు ఎప్పుడూ
ఉండాలి" ఇది ఆయన బోధ.
బాహ్య తీర్థములు సేవిస్తే మానసతీర్థములు జ్ఞప్తిలోనికి వస్తాయి. "తీర్థములు మానసములు ముక్తి ప్రదములు| బాహ్య తీర్థావళులు ముక్తిఫలమునీవు||”
సత్యము,
దయ, దానము, సంతోషము, సమత్వము, సంయమనము వంటి సుగుణములనే మానస
తీర్థములంటారు. తీర్థ దర్శనం, తరువాత
ఆయనబోధ - మనందరికీ వర్తిస్తాయి.
రామాయణంలో
ప్రథమ పాత్ర పోషించిన ఋషులు
వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్యులు. రాముని వనవాస కాలంలో అగస్త్యుడు
దండకారణ్యంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని
తపస్సు చేసుకుంటున్నాడు. అప్పటికి
అగస్త్యుడు వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు. శ్రీరాముడు
సీతా లక్ష్మణ సమేతుడై అరణ్యవాస కాలంలో శరభంగుడు,
మందకర్ణి, సుతీక్షణుడు మొదలైన మునుల ఆశ్రమాలను దర్శించాడు.
ఈ అరణ్యవాస కాలమే రామాయణంలో రామునకు,
భారతంలో పాండవులకు చాలా ఫలప్రదమైన కాలము.
తపస్సు, ఋషి దర్శనం, దేవతా
దర్శనం వంటివి వారికి ఎంతో మేలు చేశాయి.
సుతీక్షణుడు రాముని అగస్త్యముని దర్శనం చేసుకోమనీ, ఆయన ఈయగల
లాభం
మరెవరూ ఈయలేరనీ చెబుతాడు.
రాముడు, సీత, లక్ష్మణుడు అగస్త్యాశ్రమానికి
వెడతారు. అగస్త్యుడు రామునికి
అనేక అస్త్రశస్త్రాలను, వైష్ణవతేజంతో వెలుగొందే విల్లునూ, అక్షయతూణీరాన్ని, రెండు చేతులతో ఒకేసారి
యుద్ధం చేయడానికి అనువైన ఖడ్గాలను ఇస్తాడు. గోదావరి ఒడ్డున పంచవటిలో కుటీరం నిర్మించుకొని వనవాస కాలం గడపమని
ఆయనే రామునికి చెబుతాడు. రామ రావణ సంగ్రామములో
రావణుని ఎలా ఎదుర్కోవాలని రాముడు
చింతిస్తున్నప్పుడు అగస్త్యుడు అక్కడకు వస్తాడు.
రామ
రామ మహాబాహో శ్రుణు గుహ్యం సనాతనం
ఏన
సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి
అదిత్యహృదయం
పుణ్యం సర్వ శత్రు వినాశనం
జయావహం
జపేన్నిత్యం అక్షయం పరమం శివం
అనిచెబుతూ
ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందజేస్తాడు.
ఇలాగే ఆయన ఆదిత్య కవచాన్ని
, సూర్యస్తోత్రాన్ని ఇచ్చాడు. పురాణాలలో ఇవన్నీ కష్టకాలంలో మానవులను ఆయా దేవతలను స్తుతిస్తో
పఠనమో, ఉపాసనయో, పారాయణయో చేసుకోమని చెప్పడమే. రావణునిపై విజయం సాధించి పుష్పక
విమానముపై అయోధ్య తిరిగివెళ్ళేటప్పుడు రాముడు, సీత మొదలైన వారు
అగస్త్యాశ్రమము వద్ద ఆగి ఆయనకు
కృతజ్ఞతలు తెలిపి అయోధ్య వెడతారు. అగస్త్యుడు కొంతకాలము
తరువాత లంకలో, విభీషణుని రాజ్యంలో నివసిస్తాడు. మనవాళ్ళు చేసుకునే ఋషి పంచమినోములో అగస్త్యుని
స్తోత్రంలో లంకానివాస ప్రసక్తి వస్తుంది.
కాశపుష్ప
ప్రతీకాశ వహ్ని మారుత సంభవ|
మిత్రావరుణయః
పుత్ర కుంభయోనే నమోస్తుతే||
వింధ్యవృద్ధిక్షయకర
మేఘతోయ విషాపహా|
రత్నవల్లభ
దేవేశ లంకావాస నమోస్తుతే||
లోపాముద్రాదేవిని
కూడా ఈ
శ్లోకంతో సేవిస్తారు.
రాజపుత్రి
మహాభాగే ఋషిపత్ని వరాననే|
లోపాముద్రే
నమస్తుభ్యమ్అర్ఘ్యంమే ప్రతిగృహ్యతామ్||
ఇప్పుడు అర్ఘ్యం విడుస్తారు.
దక్షిణదేశంలో
అగస్త్యుడు - వింధ్య
దాటి దక్షిణదేశానికి వచ్చిన అగస్త్యుడు ఇంకా ఏమి పనులు
చేశాడు? రామ రావణ యుద్ధం
పూర్తి అయ్యాక దక్షిణదేశంలో ఉత్తరదేశస్థులంటే, వారి సంస్కృత భాష
అంటే ఒక
రకమైన విముఖత ఏర్పడింది. ఆర్యావర్తమునుండి వచ్చిన శ్రీరాముడనే క్షత్రియుడు, తమ గొప్పరాజైన రావణుని
ఓడించడం, వధించడం వారు జీర్ణించుకోలేక పోయారు.రాముడు విష్ణువు అవతారమని చెప్పబడటంచేత విష్ణుభక్తి కూడా తగ్గినది.ఈ
పరిస్థితిలో అగస్త్యుడు లంక,తమిళదేశాల మధ్య
సంచరిస్తూ సనాతన ధర్మాన్ని, ఆర్యసంస్కృతిని నిలబెట్టాడు. శివకుమారుడైన
కుమార స్వామిని గురువుగా ఆరాధించి, తమిళదేశంలో శివుని, మురుగన్
అనేపేరుతో సుబ్రహ్మణ్యుని, ఆరాధించేటట్లు చేశాడు. సంస్కృతభాషను వదలి తమిళాన్ని
అభివృద్ధిచేశాడు. తమిళులకు ఆరాధ్యుడైన మహర్షి అయ్యాడు. తమిళులు ఆయనను అగస్తియార్ అని పిలుస్తారు.
తమిళభాషకు తండ్రిగా ఆరాధిస్తారు. తమిళాన్ని మహర్షి ప్రోక్తమైన ప్రాచీన భాషగా
తలుస్తారు. స్కందుడే తమిళాన్ని అగస్త్యునకు ఇచ్చాడని చెబుతారు. తమిళాన్ని
అగస్త్యం అనేపేరుతో పిలుస్తారు.
చెంగనూరు(కేరళ) లోని భగవతి-మహాదేవ ఆలయం దక్షిణ దేశంలో
అగస్త్యునిచేత ప్రతిష్ఠింపబడిన మొదటి ఆలయం అంటారు.
ఇది అలప్పుఝ (అలెప్పి) జిల్లాలో శబరిమల మార్గంలో ఉన్నది. దక్షయజ్ఞానంతరం సతీదేవి
శరీరభాగం పడిన శక్తి స్థలం
అంటారు. శివకల్యాణ సంబంధమైన ఐతిహ్యంకూడా ఒకటి ఉంది. హిమాలయాలలో
హిమవంతుని గృహంలో శివ కల్యాణం జరిగినప్పుడు
అక్కడకు చేరిన అసంఖ్యాక దేవతాగణాల
బరువుకి, భూమి కృంగిపోవడం మొదలుపెట్టినదట.
శివుడు అగస్త్యుని భారతదేశపు దక్షిణకొనకు వెళ్ళి ఆబరువును సమంచేయమని కోరగా అగస్త్యుడు ఒప్పుకున్నాడట.
శివ పార్వతుల వివాహం చూచేందుకు దివ్యదృష్టినీ ఇచ్చిన శివుడు, తమ వివాహమయ్యాక అగస్త్యుని
స్థానానికి వచ్చి దర్శనం ఇస్తామని
చెప్పాడు. సహ్యాద్రిలో ఆస్థానంలో అగస్త్యుడు ఆ ఆలయాన్ని నిర్మించాడట.
తమిళనాడులోని అనేక శివాలయాలలో అగస్తీశ్వరుడు అనేపేరిట
శివలింగం ఉంటుంది. ప్రఖ్యాత
సుబ్రహ్మణ్య క్షేత్రం పళని లోనే కుమార
స్వామి అగస్త్యునికి దర్శనం ఇచ్చాడట.
అగస్త్యుని
తమిళ దేశంలో అనేక యోగసిద్ధులుగల సిద్ధయోగిగా
పరిగణిస్తారు. అయుర్వేదానికి తమిళ దేశంలో ప్రత్యామ్నాయంగా
పేరుపొందిన సిద్ధవైద్యానికి
(మూలికా వైద్యం) అగస్త్యునే
మూలపురుషునిగా భావిస్తారు. అనేక దీర్ఘకాల వ్యాధులకు సిద్ధవైద్యం
ప్రసిద్దిపొందినది.
ఉత్తర
ఆకాశంలో ధ్రువ నక్షత్రం (Pole Star) ఉన్నట్లు, దక్షిణ
ఆకాశంలో ప్రకాశవంతమైన దక్షిణ నక్షత్రం (Southern Pole
Star) ఉన్నది.
దానిని భారతీయ జ్యోతిశ్శాస్త్రములో అగస్త్యనక్షత్రమని పిలుస్తారు. దిక్సూచి లేనప్పుడు ఈ నక్షత్రాన్ని నావికులు
దక్షిణదిశనుగుర్తించడానికి
వాడేవారు. దీనిని ఆధునిక ఖగోళశాస్త్రంలో కానొపస్ (Canopus) అని పిలుస్తారు.
అగస్త్య,
మార్కండేయ మహర్షులు సువర్ణభూమికి (ఇండొనీషియా)సనాతన ధర్మాన్ని తీసుకొని
వెళ్ళారని చెబుతారు. ఇండొనీషియాలొ అగస్త్య చాల ఎక్కువగా వినిపించే
పేరు. హిందువులేకాక ముస్లిములు, క్రైస్తవులు, సంస్థలకు కూడా అగస్త్యుని
పేరు పెట్టుకుంటారు. ఇండొనీషియా బహాసా (భాష) లో సంస్కృతపదాలు కనుపిస్తాయి. రాజధాని జకార్తా (జయకర్త) మరియొక పెద్దనగరం యోగ్యకర్త పదాలు సంస్కృతమే. తమిళదేశం
ఈ ఆగ్నేయ-ఆసియా దేశాలతో వాణిజ్యం
నిర్వహించేది. 10 వ శతాబ్దము నాటికి
హిందూమతము ప్రధానంగా ఉండేది. ప్రాంబనన్ (మూల పదం పరబ్రహ్మ) నగరంలో
పెద్ద శివాలయం ఇరు ప్రక్కల బ్రహ్మ
విష్ణువు, త్రిమూర్తుల విగ్రహాలతో ఉన్నది. అది అగస్త్యుడు ప్రతిష్టించాడనిచెబుతారు.
బాలి ద్వీపంలో ప్రజలు హిందువులే. శివునితోబాటుగా అగస్త్యుని పూజిస్తారు.
ఈవ్యాసంలో
చాలా భాగానికి ఆధారం సద్గురు శివానందమూర్తిగారి
రెండు సంపుటాల "మార్గదర్శకులు - మహర్షులు" అనే గ్రంధం. 50 పుటల నిడివితో వారి పుస్తకంలో అగస్యునిపై
వ్యాసంలో ఉన్న అనేక విషయాలలో
కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
వారి మహర్షుల చరిత్ర ఉపన్యాసాలను వారి కంఠస్వరములోనే, సనాతన
ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్లో
వినవచ్చును.
(www.sdctbheemili.org/)

No comments:
Post a Comment