7
యోగ పరిభాష
శరీరము, దేహము, క్షేత్రము,
The body
1.
స్థూలశరీరము – The gross body ఇంద్రియ
గోచరము, నశ్వరము, పంచభూతాత్మకము ఐన శరీరము - The gross or material and perishable body, with
which a soul clad in its subtle body, is invested
2.
సూక్ష్మశరీరము = లింగశరీరము -- The
subtle body అంగుష్ఠమాత్ర ప్రమాణము, దేహరూపము కలిగిన జీవుడే సూక్ష్మ శరీరరూపమున సమస్త దైహిక క్రియలు చేయుచూ, పుణ్యపాప కర్మలను ఆచరిస్తూ జన్మాంతరమందు సుఖ దుఃఖములను సంపాదించు కొనుచున్నాడు. – The subtle body of the soul (jiva), the miniature model of the
gross or visible body, which is not destroyed by death and is said to accompany
the soul in its transmigration
స్వర్గ
నరకవాసములకు ఈ సూక్ష్మ శరీరమే భోగ శరీరముగాను, యాతనా శరీరముగాను రూపుచెందును. (akin to wearing appropriate dresses)
3.
కారణశరీరము – The causal body, అజ్ఞానరూపమైన దేహము, స్థూలసూక్ష్మదేహములకు లోపల ఉండి మఱొక దేహమును ఇచ్చుటకు హేతువైన దేహము. The causal
body is due to avidya and maya the root cause of the gross and subtle bodies
ఆత్మ
- జీవాత్మ - పరమాత్మ
జీవాత్మ, జీవుడు, దేహి, శారీరకుడు, అంగుష్ఠమాత్ర
పురుషుడు, క్షేత్రజ్ఞుడు (ప్రేత, పరేత)
జీవుడు దేహాంతర్యామి. అంగుష్ఠ మాత్రుడు. సూక్ష్మశరీరధారి.
ఇది దేహ రూపమును కలిగియుండును. పుణ్య, పాప కర్మలను ఆచరించి ఉతర జన్మయందు సుఖదుఃఖములు
సంపాదించుకొనును. దైహిక క్రియలలో తాదాత్మ్యము పొందును. ఇది కర్త, భోక్త. ఇక పరమాత్మస్థితి ఎక్కడ? ఈ అంగుష్ఠమాత్ర జీవుని
కేంద్రమున బిందు రూపముగా పరమాత్మ ఉపస్థితమై ఉన్నది. దీని వలననే
జీవుని జీవయాత్రాక్రియలు, సుఖదుఃఖానుభవములు కలుగుచున్నవి. పరమాత్ముడు కర్త కాడు,
భోక్తకాడు, సాక్షిమాత్రుడు.
దేహాత్మ
భావన
ఈ శరీరమే తానను జీవభావము. ఈ దేహాత్మ భావనను వదలి
మనోబుద్ధి,చిత్తాహంకారములను వశముచేసికొనినచో ఈ సూక్ష్మశరీరమైన జీవుడు తనయుందున్న పరమాత్మను
దర్శించి విశ్వవ్యాప్తుడు కాగలడు. ఈ జీవుడే సాధకుడు, ఉపాసకుడు. స్థూల శరీరము ప్రాణమున్ననూ
జడమైన యంత్రమే.
8
యమలోకంలోని యముని గృహానికి నచికేతుడు ఎలా వెళ్ళాడు?
మొదట యమలోకంగురించి తెలుసుకుందాం. యమలోకం భయంకరమైన
లోకంకాదు. స్వర్గంవలే మహాతేజోవంతమైన ఊర్ధ్వలోకం. యముడు సూర్యపుత్రుడు, దక్షిణదిక్పాలకుడు.
కొంతకాలం భూలోకంలో ఒక మనుష్యదేహం ధరించి కొన్ని కర్మలుచేసి, మృత్యువాతపడి, దేహాన్ని
విడిచిన జీవుడు దేహాత్మ భావనను వీడక, ప్రేతరూపంలో,
మరణించిన ఒక సంవత్సరానికి, యమలోకానికి వస్తాడు. అంతవరకు ఆజీవి పరేత (ప్రేత). మృత్యువు,
దహనము వంటి కార్యక్రమముతో వచ్చిన తృష్ణ, తాపము, పిపాసతో బాధపొందుతున్న ఆతని జీవుని,
ఈ యానంలో ఆత్మ శాంతికి కుమారులు చేసిన తిలోదకాలు, ఇతర కర్మకాండ, దానాలు తోడ్పడుతాయి.
యముడు సమవర్తి, పరేతరాట్, అంటే ప్రేతలకు రాజు. ఆ జీవుని పుణ్య పాప కర్మలకు అనుగుణంగా
యేయే ఫలాలు ఇవ్వాలో అవి ఇచ్చేవాడు యముడు. ఆజీవుడు
భోగ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలో, యాతనాశరీరంతో నరకానికి వెళ్ళాలో, ప్రేతరూపంలోనే
భూలోక పరిధిలోనే కొంతకాలం ఉండి పునర్జన్మ పొందాలో,
ఎలాంటి జన్మ పొందాలో నిశ్చయించేవాడు ధర్మదేవతయైన యముడు. నరకం పాపులు శిక్షలుపొందే లొకం.
నచికేతుడు మరణించలేదు. అతడి ఆయుర్దాయము పూర్తికాలేదు.
అతడు తండ్రి వాక్కులోనున్న బలముతో తక్షణమే యమలోకంలో ఉన్నాడు. వైశ్వానరుని వలే (అగ్నివలె)
ప్రవేశింఛాడని ఉపనిషత్తుచెబుతూంది. అంటే మరణించకుండా శరీరము వదలి తేజోరూపాన్ని స్వీకరించి
వెళ్ళాడన్నమాట. ఇది యోగమార్గము. ఉదాహరణకు దీనిని పరకాయ ప్రవేశ విద్యతో పోల్చవచ్చు.
పరకాయ ప్రవేశంలో జీవుడు తనస్వదేహాన్ని వదలి మరో (మృత) శరీరంలోనికి వెడతాడు. ఇక్కడ సూక్ష్మదేహంతో,
తాను నచికేతుడననే భావంతోనే వెడతాడు. నచికేతుని శరీరం తండ్రి ఆశ్రమంలోనే మరణించకుండా
నిలిచి ఉన్నది. సగం ప్రాణం జీవునిలోను, సగం వదలిన శరీరంలోనూ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైనది?
9
నచికేతసుని తండ్రియైన వాజశ్రవసునికి విశ్వజిత్
యాగము తరువాత ఒక మాటలో కుమారుని యమునియొద్దకు పంపగల సత్యవాక్కు, శక్తి ఎలా వచ్చాయి?
ఈ వేదవాక్కును గమనించండి - న కర్మణా న ప్రజయా ధనేన , త్యాగేనైకే అమృతత్వమానసు
- మోక్షము సంపద వలన, సంతానము వలన, కర్మల వలన (పుణ్య కర్మలు కూడా) లభించదు. కేవలము ఆమూడింటి త్యాగము వలననే
లభిస్తుంది. నచికేతుని తండ్రి మొదట తన సంపదనంతా దానం చేశాడు. కర్మ ఫలంగా వచ్చే
ఊర్ధ్వలోక ప్రాప్తిని మోక్షంకొరకై త్యాగం చేశాడు. ఆఖరు బంధమైన కుమారుణ్ణి యమునకు దానమిచ్చాడు. ఈ మూడు దానాల ఫలం ఏమిటి? భూమిపై తను త్యాగము చేసినది
భగవంతునికి చేరుతుంది. (భోక్తారం యజ్ఞ తపసాం - భ.గీ.) భగవంతుడు ఆసంపదను ఏమి చేస్తాడు? ప్రార్థించిన వారికి
భౌతిక సంపదను ఇస్తాడు. లేదా స్వర్గసౌఖ్యాలు
ఇస్తాడు. నచికేతునికి కావలసినవి ఈ రెండూ కాదు. అతనికి కావలసినది జీవుని గతిని గురించిన
జ్ఞానము. జీవులు తాము సామాన్యంగా చేసే దానాలు,
ఇతరపుణ్యకార్యాలన్నీ తమ పిల్లల భవిష్యత్తు కోసమే చేస్తారు. ఇది వారిని బంధించి ఉంచుతుంది.
కాని వాజశ్రవసుడు తన ఏకైక పుత్రుణ్ణి దేవతలకు దానంచేసి మోక్షానికి అర్హుడయ్యాడు. అతని దానాల ఫలం కుమారుని
జ్ఞాన సముపార్జనకు కూడా తోడుపడినది. మరణించినతరువాత జీవుని యదార్థస్థితిగతులు ప్రత్యక్షంగాచూచి
అధికారికంగా చెప్పగలవాడు యముడు. యముడు నచికేతసుని పరీక్షించి, అతను జ్ఞానము పొందుటకు
అర్హుడని తేల్చుకొని జ్ఞాన బోధచేశాడు.
తైత్తిరీయ బ్రాహ్మణము నుండి కొంత కథ
ఉపనిషత్తులో లేని కొన్ని అంశాలు తైత్తరీయబ్రాహ్మణములో
ఉన్నాయి. ఔద్దాలకుడు తన కుమారునితో "నిన్ను
నేను మృత్యువుకు ఇస్తాను అని చెప్పగానే నచికేతుడు
ఆలోచిస్తూ తండ్రికి కొంచెందూరంగా వెడతాడు. అప్పుడు అశరీరవాణి వాక్కులు ఇలా వినబడ్డాయి.
"గౌతమ కుమారా! (వారు గౌతమగోత్రజులు) నీతండ్రి చెప్పినది నిజమే. ఆయన నిన్ను మృత్యువుకు
ఈయడానికే సంకల్పించాడు. నీవు తండ్రి ఆజ్ఞ ప్రకారం యమలోకం వెళ్ళగానే ఆయన నీకు దర్శనమీయడు.
మూడు రాత్రులు అక్కడ నీవు ఆహారంలేకుండా గడపాలి. యముడు వచ్చి నిన్ను "బ్రాహ్మణుడా!
నీవు ఎన్ని రాత్రులు నీవు ఇక్కడ గడిపావు? అని అడుగుతాడు. "మొదటి రాత్రి ఏమి తిన్నావు?"
అని అడుగుతాడు. "నీ సంతానాన్ని" అని చెప్పు. రెండవరాత్రి ఏమి తిన్నావు?"
అని మళ్ళీ అడుగుతాడు. "నీ సంపదని" అని చెప్పు.మూడవరాత్రి ఏమితిన్నావని మళ్ళీ
అడుగుతాడు. "నీపుణ్యాన్ని" అని చెప్పు. (అశరీరవాణి అంటే అందరికీ వినపడేది
కాదు. అంతరాత్మ ప్రబోధం అని అనుకోవచ్చును.) నచికేతుడు యముని గృహంలో అలాగే సమాధానాలు
చెబుతాడు.
10
దహరం
విపాపం పరమేశ్మభూతం యత్ పుణ్డరీకం పురమధ్యసగ్ంస్థం
తత్రాపి
దహరం గగనం విశోకః తస్మిన్ యదంతః తదుపాసితవ్యం
Located
in the center of the body is the subtle lotus of the heart, pure and untainted,
which is the abode of the Supreme Being. Meditate on the Supreme Being residing
in that inner expanse, which is subtle and free from sorrow.
మరికొంత పరిభాష
పంచ ప్రాణములు = 1. ముఖ్య
ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (ఆసనమున యుండునది) 3. సమానము (నాభి మండలమున నుండునది) 4. ఉదానము (కంఠమున నుండునది) 5.వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది)
ప్రాణాహుతులు = భోజనానికి ముందు పంచప్రాణములకిచ్చు ఆహుతులు
మృత్యువు = ఆయుర్దాయము పూర్తి అయినప్పుడు, హృదయ
సమీపములోని ముఖ్యప్రాణము స్వస్థానమును వీడి ఊర్ధ్వమార్గముకాని, అధోమార్గముకాని అనుసరించి
నిర్గమించును. దీనికి పూర్వము దేహమంతటను వ్యాపించిన మిగిలిన నాలుగు క్రియాశీలక ప్రాణములు,
వాటి వాటి క్రియలను వదలిపెట్టి కేంద్రమునందలి ముఖ్య ప్రాణమును చేరును. ఆనాలుగు ప్రాణముల
ఉపసంహారమే మృత్యుబాధ. జీవనకాలమందు మనుష్యుడు ఈ బాధను ఊహింపలేడు. ఈ ముఖ్య ప్రాణమే గీతలో
భగవంతుడు చెప్పిన " అహం వైశ్వానరో భూతా ప్రాణినాం దేహమాశిత". మిగిలిన నాలుగు
ప్రాణములు "ప్రాణాపాన సమాయుక్తా పచామ్యన్నం చతుర్విధం" అన్నట్లు ఆహారమును
నాలుగు కార్య రూపములుగా పచనము చేయుచున్నవి.
పంచకోశములు - లిఙ్గ శరీరము
పంచకోశములు = The five sheaths enclosing the human soul, the
physical body being the grossest. 1. అన్నమయము, 2. ప్రాణమయము, 3. మనోమయము, 4. విజ్ఞానమయము. 5. ఆనందమయము
ఆత్మ – The soul is covered by three bodies: karana,
sukshma and sthula or by five conceptual sheaths described above.
ఈ పంచ కోశములన్నీ అనాత్మలు, అవిద్యభూమికలు. వీనిని
అర్థము చేసుకొని ఆయా కోశములలో ఉపాసన చేసిన, హేతు స్వరూప సోపాన పంక్తి (కార్య కారణరూపమైన
మెట్ల వరుస) క్రమముగా బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి దారి తీయును.
దహరాకాశము లేక హృదయపద్మము
ఈ పంచకోశముల లోపల ప్రదేశాన్ని బుద్ధి గుహ, దహరాకాశము
లేక హృదయపద్మము (Heart Cavity) అంటారు. దహరము అంటే హృదయమే. ఇదే యోగశాస్త్రములోని అనాహత
చక్ర స్థానము.
ఈ పంచకోశముల విశ్లేషణ తైత్తిరీయ ఉపనిషత్తు లోనిది. వరుణదేవుడు తన కుమారుడైన భృగువుకు బ్రహ్మ జ్ఞానమునకు
మార్గదర్శనము చేయుట దీనిలోని విషయము. భృగువుకు నచికేతుని వలెనే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని
తీవ్రజిజ్ఞాస కలిగినది. దయతో తనకు బ్రహ్మతత్త్వోపదేశం చేయమని తండ్రిని అడిగాడు. దానికి
తండ్రి – “నాయనా ! అన్నం, ప్రాణం, నేత్రం, శ్రోత్రం, మనస్సు, వాక్కు – ఇవన్నీ బ్రహ్మోపలబ్ధికి
సాధనాలే. వీటన్నిటిలో బ్రహ్మతత్త్వం యొక్క అస్తిత్వం స్ఫురిస్తూనే ఉంటుంది. దేనిలోనుండి
ఈ సర్వమూ ఉత్పన్నమయిందో, దేనిచేత పరిపోషింపబడుతున్నదో, దేనిలో చిట్టచివఱకు మహాప్రళయకాలంలో
తిరిగి లయమవుతున్నదో ఆ మూలవస్తువును తెలుసుకొనడానికి ప్రయత్నించు. ఆ మూలతత్త్వాన్ని
తపస్సుద్వారా ప్రత్యక్షం చేసుకొని అనుభవించు.” అని చెప్పాడు. భృగువు తపస్సుచేసి మొదటగా తెలుసుకొన్నది అన్నం
వల్లనే ఈ సర్వప్రాణులూ ఉత్పత్తి చెందుతున్నాయి. పుట్టిన ప్రాణులన్నీ అన్నం వల్లనే పరిపోషింపబడి
సురక్షితంగా ఉంటున్నాయి. మరణించిన తర్వాత కూడా అన్నరూపమైన ఈ పృథివిలోనే అన్ని జీవరాశులూ
కలిసిపోతాయి. ఆ తపస్సులో కల్గిన ప్రథమప్రబోధం బ్రహ్మం అన్నస్వరూపమనిపించడం. ఈ విషయమంతా
తండ్రికి నివేదించాడు భృగువు. తండ్రి ఇలా అన్నాడు. “నాయనా ! నీకు బ్రహ్మం యొక్క స్థూలరూపమే
పరిచయమైంది. నీవు ఇంకా తపస్సుచేయాల”ని చెబుతాడు. ఇలావరుసగా ప్రాణమే బ్రహ్మ తత్త్వమని,
మనస్సే బ్రహ్మ తత్త్వమని, విజ్ఞానమే బ్రహ్మ తత్త్వమని, ఆనందమే బ్రహ్మ తత్త్వమని వచ్చి
తండ్రికి చెబుతాడు భృగువు. తండ్రి కొడుకుతో,
“కుమారా ! ఆనందం అనేది అన్నిటి కన్నా ఉత్తమంగా పరమాత్మరూపాన్ని విస్పష్టం చేసే రూపం.
అయినా, అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం – ఇవన్నీ బ్రహ్మస్వరూపాలే.
కానీ ఇవి ఒకదాని కన్నా మఱొకటి సూక్ష్మమయినవి. అన్నిటి కన్నా మించినది ఆనందమయ బ్రహ్మానుభూతి.”
అనిచెబుతాడు.
11
నచికేతసుడు యముణ్ణి మూడు వరాలు అడుగుతాడు. ఆ మూడు
వరాలలో ఈమూడు ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.
1.
యమలోకంలోని యముని గృహానికి నచికేతుడు ఎలా వెళ్ళాడు? యమలోకంనుండి తిరిగి ఎలా వచ్చాడు?
2.
యముడు తెలిపిన నచికేతాగ్ని అనే అగ్నివిద్య, ఆత్మవిద్యను ఇచ్చే ఉపనిషత్తులో ఎందుకు చెప్పబడినది?
3.
మూడవ వరములొ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి, మృత్యుంజయత్వాన్ని ప్రసాదించే నచికేతవిద్య లోని యోగసాధనా రహస్యము ఏమిటి?
ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు సద్గురు శివానందమూర్తి గారి కఠయోగము తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలలో లభిస్తాయి. ఇందులో ఇంగ్లీషు పుస్తకము పీఠికలో మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు
నచికేతసుని వయసులో గురువుగారికి వచ్చిన యౌగిక అనుభవం, ఆయనకు లభించిన ఆదిశేషువు దర్శనం వర్ణిస్తారు. యోగసూత్రాల కర్త పతంజలి మహర్షి ఆదిశేషుని అవతారమని సుప్రసిద్ధం.
మొదటి
ప్రశ్నకు సమాధానముకూడా యోగ విషయమే. ఇది అర్థము చేసుకోవడానికి సృష్టిలోని జగత్తును, శరీరములోని జీవుని సామ్యమును అర్థము చేసుకోవాలి. సృష్టింపబడిన మొదటి వస్తువు ఆకాశము. సృష్టి పూర్వమున్నది బ్రహ్మము. సృష్టి సంకల్పముతో అది ప్రకృతి పురుషతత్త్వములుగా,
శివ శక్తులుగా, విభజింపబడినది. శివుడే ఆత్మ స్వరూపుడు. ఆకాశము ఆత్మయొక్క మొదటి వికారము. దానినుండి పుట్టినది వాయువు. వాయువునుండి పుట్టినది అగ్ని. అగ్నినుండి పుట్టినది జలము. జలమునుండి పుట్టినది భూమి. ఇవన్నియూకలసి స్థూల బ్రహ్మాండము. దీనిని విరాట్బ్రహ్మము అంటారు.
ద్యులోకము (భువర్లోక, సువర్లోకాది లోకములకు ఉపనిషత్ పరిభాష, సూర్య చంద్రులు, ఇవన్నియూ దీని అవయవములు ద్యావా పృథివి (ఆకాశము, భూమి) పితర్మాతలు (తండ్రి, తల్లి) అని వర్ణించారు.విరాట్ బ్రహ్మము యొక్క సూక్ష్మరూపమే మానవ దేహము. అందుకే దేహమునకు క్షుద్రబ్రహ్మాండము
అని వ్యవహారము.
విశ్వవ్యాప్తమైన పరమాత్మ అణురూపములో కేంద్రబిందువుగానుండి,
మనుష్యుని బుద్ధిగుహలో అంగుష్ఠమాత్రుడైన జీవునిగా పరిణామంచెంది, మనోప్రాణ, దేహములను సంతరించుకొని "నేను ఈ స్థూలదేహమును" అనుకొని ప్రవర్తించుచున్నది.
మానవునకు దేహభావననుండి లోనికి వెళ్ళి ఈ ఆత్మను పరమాత్మగా తెలుసుకొనుట సాధ్యమే.
12
రెండవ
వరంగా నచికేతసుడు స్వర్గాది ఉత్తమలోకాలకు తీసికొనివెళ్ళే క్రతురహస్యం చెప్పమని యముణ్ణి అడిగాడు. దానికి యముని సమాధానం -
ప్రతేబ్రవీమి తదుమే నిబోధ
స్వర్గ్యమగ్నిం నచికేతః ప్రజానన్
అనంతలోకాప్తిమధో ప్రతిష్ఠాం
విద్ది
త్వమేతం నిహితం గుహాయాం. (1.14)
ఓ నచికేతసా! స్వర్గమునకు తీసుకువెళ్ళే అగ్నితత్త్వమును నీకుచెబుతాను. సామాన్యమైన పుణ్యములు, యజ్ఞకర్మల వలన లభించిన స్వర్గ సౌఖ్యములు పుణ్యఫలము అయిపోగానే జీవులకు నష్టమౌతున్నవి. నేను చెప్పబోయే అగ్నికర్మ జీవునకు అనంత ఉత్తమలోక ప్రాప్తిని ఇస్తుంది. పునర్జననము లేనందువలన ఇది మృత్యుంజయత్వమే. ఇది హృదయకమలమునకు దిగువగా ప్రతిష్ఠింపబడిన యోగ రహస్యము. దీనిని బాగుగా తెలిసికొనుము. అథో ప్రతిష్ఠాం నిహితం గుహాయాం - అంటే హృదయకుహరానికి - అనాహత చక్రానికి - క్రిందచక్రములలో సాధనయే ఈ అగ్ని కార్యము. ఇది అంతర్యాగము. ఇక్కడ ఉత్తమలోకాలకు యోగ మార్గము, మోక్షస్థానమైన హృదయకుహరమూ సూచింపబడినవి.
ఈ మంత్రభావాన్ని అర్థం కావడానికి కొంత యోగసాధనను గురించిన విజ్ఞానం
తెలియాలి. పద్మాసన స్థితుడైన యోగి వెనుపాము వెంట శిరస్సు వరకు ఏడు ప్రాణ శక్తికేంద్రాలు గుర్తించవచ్చు. వీనిని చక్రాలు అంటారు. క్రిందనుండి పైకి మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం,ఆజ్ఞాచక్రం - ఈ షట్చక్రాల పైన సహస్రారం. మూలాధారం వెన్నెముక క్రింద ఉంటుంది. సామాన్యమానవునికి ఇచ్చటనున్న కుండలినీ శక్తి నిద్రావస్థయందుండి
అతడికి స్థిరమైన దేహాత్మభావన కలుగుచున్నది. ఈ కుండలిని అనుదాని చైతన్యమే శరీరమందలి నాడీమండలమున ప్రవేశించి పంచ ప్రాణముల రూపమున అనేక దేహక్రియలను నిర్వహిస్తున్నది.
సృష్టిలోని బ్రహ్మాండములో ఎన్నో లోకములున్నవి. ఆయా లోకములలోని జీవులు ఊర్ధ్వగతియందు ఒక్కొక్కలోకమునందు
ఒక్కొక్క ఔన్నత్యమును పొందుచున్నారు యోగములో భూమిపైనుండి యోగసాధన వలన తనశరీరమందే అంతర్భూతమగు బ్రహ్మాండమును దర్శించి ఆయాలోకముల జ్ఞానమును పొంది ఆనందింపవచ్చును.
దేహమందలి లోకములకు
సంబంధించిన విజ్ఞానమిట్లున్నది.
మూలాధారము - దేవత: బ్రహ్మ, లోకము: భూలోకము, గ్రంధి: బ్రహ్మ, గుణము: తమస్సు, తత్త్వము: భూమి
స్వాధిష్ఠానము - దేవత: విష్ణు, లోకము: భువర్లోకము, గ్రంధి: బ్రహ్మ, గుణము: తమస్సు, తత్త్వము: జలము
మణిపూరకము - దేవత: రుద్ర , లోకము: స్వర్లోకము, గ్రంధి: విష్ణు, గుణము: తమస్సు, తత్త్వము: అగ్ని
అనాహతము
- దేవత: ఈశః , లోకము: మహర్లోకము, గ్రంధి: విష్ణు, గుణము: రజస్సు, తత్త్వము: వాయువు
విశుద్ధము- దేవత: సదాశివః , లోకము: జనోలోకము, గ్రంధి: రుద్ర, గుణము: రజస్సు, తత్త్వము: ఆకాశము
ఆజ్ఞా
- దేవత: పరమశివః, లోకము: తపోలోకము, గ్రంధి: రుద్ర, గుణము: సత్త్వ, తత్త్వము: మనస్సు
సహస్రారము - లోకము: సత్య లోకము
గుణము:
సత్త్వ, తత్త్వము: ఆత్మ
No comments:
Post a Comment